Narendra Modi: తెలంగాణలో మరో రెండు మోడీ సభలు
Narendra Modi: తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి వరుస కార్యక్రమాలతో ఫుల్ జోష్ మీదుంది.
Narendra Modi: తెలంగాణలో మరో రెండు మోడీ సభలు
Narendra Modi: తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి వరుస కార్యక్రమాలతో ఫుల్ జోష్ మీదుంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ బీజేపీ పెద్దలు వరుసగా తెలంగాణకు వస్తుండటంతో.. ఎన్నికల ఊపు జోరందుకుంది. వారం రోజుల క్రితమే మోడీ మూడు రోజుల గ్యాప్‌లో రెండు భారీ బహిరంగ సభలకు హాజరయ్యారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ‌్యంలో భారీ బహిరంగ సభలపై బీజేపీ కసరత్తు పెంచింది.
తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఈనెల 27న హుజురాబాద్ జరిగబోయే బహిరంగ సభకు అమిత్ షా హజరుకానున్నారు. 14న శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ప్రచారం చేయనుండగా.. 15న కేంద్రమంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతి ముషీరాబాద్‌లో పర్యటించనున్నారు. 16న కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజనాధ్ సింగ్ మహేశ్వరంలో పర్యటించనున్నారు. 19వ తేదీ మధిరలో కేంద్రమంత్రి నారాయణస్వామి, 20న కేంద్రమంత్రి స్మ్రతీ ఇరానీ ప్రచారం నిర్వహించనున్నారు.