Jagtial: ప్రజల వద్దకే పాలన.. ఏనుగుమట్ల గ్రామస్తులతో మంత్రి ముచ్చట్లు!
Jagtial: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఏనుగుమట్లలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు సామాన్యులతో మమేకమయ్యారు.
Jagtial: ప్రజల వద్దకే పాలన.. ఏనుగుమట్ల గ్రామస్తులతో మంత్రి ముచ్చట్లు!
గొల్లపల్లి (జగిత్యాల జిల్లా): రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన పర్యటనలో భాగంగా సామాన్య ప్రజలతో మమేకమై వారి మనసు గెలుచుకున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఏనుగుమట్ల గ్రామంలో ఆదివారం ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
చెట్ల నీడన ఆత్మీయ పలకరింపు:
వేసవి తాపానికి తట్టుకోలేక గ్రామస్తులు కొందరు చెట్ల నీడన కూర్చుని సేదతీరుతున్నారు. ఆ దారిలో వెళ్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వారిని చూడగానే తన కాన్వాయ్‌ను ఆపి స్వయంగా వారి వద్దకు వెళ్లారు. "అక్కా.. అన్నా.. ఎట్లా ఉన్నారు?" అంటూ ఎంతో ఆత్మీయంగా పలకరించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు.
మంత్రి దృష్టికి వార్డు సమస్యలు:
ఈ సందర్భంగా గ్రామస్తులు తమ వార్డుల్లో ఉన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యల గురించి వివరించారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న మంత్రి, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఒక మంత్రి హోదాలో ఉండి కూడా సాధారణ వ్యక్తిలా అందరితో కలిసి కూర్చుని మాట్లాడటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ఇలాగే ప్రజల మధ్యకు రావాలని వారు కోరుకుంటున్నారు.