Tula Uma: బీజేపీకి తుల ఉమ రాజీనామ
Tula Uma: ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి తుల ఉమ
Tula Uma: బీజేపీకి తుల ఉమ రాజీనామ
Tula Uma: బీజేపీకి తుల ఉమ రాజీనామ చేశారు. తన జాతి గొల్లకురుమలను.. అవమానించిన పార్టీ బీజేపీ అంటూ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. బీజేపీ బీసీ నినాదం తీసుకోవడం హాస్యాస్పదమని ఆమె కిషన్ రెడ్డికి లేఖరాశారు. మీ టికెట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానీకంతో.. తనకు ఉన్న బంధాన్ని తెంచలేవంటూ లేఖలో పేర్కొన్నారు.
ఇవాళ కేసీఆర్ సమక్షంలో తుల ఉమ బీఆర్ఎస్ లో చేరనున్నారు. వేములవాడ నుంచి తుల ఉమ బీజేపీ టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఆమెను బీఆర్ఎస్ తమ పార్టీలోకి ఆహ్వానించింది. దీంతో బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు మొగ్గుచూపారు. ఇవాళ ఆమె గులాబీ కండువా కప్పుకోనున్నారు.