TSRTC Strike: ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనున్నది. బస్సులు బంద్ ప్రభావంపై నివేదికను ప్రభుత్వం కోర్టుకు సమర్పించనున్నది. సమ్మెపై కోర్టులో మరోసారి వాదనలు కొనసాగనున్నాయి.

Update: 2019-10-10 05:11 GMT

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బస్సులు బంద్ ప్రభావంపై నివేదికను ప్రభుత్వం కోర్టుకు సమర్పించనున్నది. సమ్మెపై కోర్టులో మరోసారి వాదనలు కొనసాగనున్నాయి. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలి, లేదంటే సమ్మె కొనసాగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమింపజేచేలా తీర్పు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.అక్టోబర్ 10లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని గతంలోనే కోర్టు ఆదేశించింది.

అయితే బుధవారం ఆర్టీసీ జేఎసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు. ప్రభుత్వం బెట్టు దిగకుంటే రాష్ట్ర బంద్ కూడా నిర్వహిస్తామని ప్రకటించిన అఖిలపక్ష నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నేడు కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News