TSRTC: ప్రయాణికులపై టీఎస్‌ ఆర్టీసీ మరో భారం

TSRTC: ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని,.. గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో రూ.5-10 పెంపు

Update: 2022-03-28 11:00 GMT

TSRTC: ప్రయాణికులపై టీఎస్‌ ఆర్టీసీ మరో భారం

TSRTC: ప్రయాణికులపై టీఎస్‌ ఆర్టీసీ మరో భారం మోపింది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు నిత్యవసరాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. సగటు సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పేదవాడిపై మరో భారం పడనుంది. టీఎస్‌ ఆర్టీసీలో బస్సు ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో 5 నుంచి 10 రూపాయలు పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఆర్డినరీ బస్సుల్లో సెస్‌ పేరుతో రూపాయి వసూలు చేసేందుకు గతంలో ప్రభుత్వం అనుమతించింది. ఇక.. పెరిగిన ఛార్జీలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. 

Tags:    

Similar News