నేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
TS Tenth Exams 2022: ఉ. 9.30గంటల నుండి మ. 12.45 వరకు పరీక్ష
నేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిముషాలు లేటైన నో ఎంట్రీ...
TS Tenth Exams 2022: కాసేపట్లో తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9గంటల 30నిమిషాల నుండి మధ్యాహ్నం 12గంటల 45నిమిషాల వరకు ఎగ్జామ్ జరగనుంది. ఎగ్జామ్‌కు 5నిమిషాల నిబంధన ఉంటుందంటున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 861సెంటర్లలో పరీక్షలు జరగనుండగా... ఎగ్జామ్స్ సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 1వ తేదీ వరకు జరిగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కు.. ఇవాళ 5లక్షల 9వేల 275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.