అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ..
Tamilisai Soundararajan: తెలంగాణలో పొలిటికల్ అప్‌డేట్స్‌పై నివేదిక...
అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ..
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటి ఆసక్తి రేపుతుంది. తెలంగాణలోని తాజా పరిస్థితులు అమిత్ షాకు నివేదిక సమర్పించినట్టు సమాచారం. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర నిలుపుదల, అరెస్ట్.... ఎమ్మెల్యే రాజాసింగ్ బెయిల్ తరువాత చోటుచేసుకున్న పరిణామాలు.... ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై తెలంగాణలో ప్రకంపనలు....బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్ తదితర అంశాలపై తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. పలు అంశాలపై గవర్నర్ కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటనలో వివిధ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకున్న గవర్నర్ హైదరాబాద్ తిరుగు పయనం అయ్యారు.