పెద్ద మనసు చాటుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో కనకవ్వ, పాపయ్యగౌడ్ లకి సమత, మమత ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.

Update: 2020-05-03 17:27 GMT
MLA Sunke Ravi Shankar

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో కనకవ్వ, పాపయ్యగౌడ్ లకి సమత, మమత ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. వారిది పేద కుటుంబం.. పూరి గుడిసెలో నివసిస్తారు. అయితే ఎనిమిదేళ్ళ క్రితం కనకవ్వ క్షయవ్యాధితో మృతి చెందింది. పాపయ్యగౌడ్ తన ఇద్దరు కూతుళ్ళను అల్లారుముద్దుగా పెంచాడు. వారం రోజుల ముందే వచ్చిన అకాల వర్షాలకు గాను వారు నివసిస్తున్న పూరి గుడిసె కూడా కూలిపోయింది. దీంతో గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకు చేరారు. విధి వారిని మరోసారి వెక్కిరించింది. అద్దె ఇంట్లో చేరిన వారం రోజులకే పాపయ్యగౌడ్ గుండెపోటుతో చనిపోయాడు. దీనితో సమత, మమత తల్లిదండ్రులని కోల్పోయి అనాథలుగా మారారు.

గ్రామంలోని దాతల సాయంతో ఆ ఆడపిల్లలిద్దరే తండ్రి అంత్యక్రియలు చేశారు. ఇక తండ్రికి చేయాల్సిన కర్మకాండలను అద్దె ఇంట్లో చేయోద్దంటూ ఇంటి యాజమానులు చెప్పడంతో వారు ఊరు బయట టెంట్ వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ విషయం కాస్తా చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి రావడంతో పెద్ద మనసుతో ముందుకు వచ్చి వారిని అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లాక్‌డౌన్ పూర్తికాగానే అక్క సమతకు ఉపాధి కల్పిస్తామని, మమతకు వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వెంటనే రూ.20వేలు, క్వింటా బియ్యం అందజేశారు. ఇంకా దాతలు ముందుకు రావాలని కోరారు. 


Tags:    

Similar News