టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2019-12-24 09:19 GMT
శంకర్ నాయక్‌

టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనుషుల్లో మూడు రకాల బలుపు ఉంటాయన్న ఆయన రెండు రకాల కులాల పేర్లను నేరుగా ప్రస్తావించారు. ఆ రెండు కులాలతో పాటు డబ్బు, చదువు అనే బలుపులు మనుషులకు ఉండకూడదన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో సోమవారం ఓ చర్చిలో క్రిస్మస్ సందర్బంగా క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

మనిషికి మూడు బలుపులుంటాయి ఈ ప్రపంచంలో. ఏం బలుపయా అంటే.. ఒకటి నేను రెడ్డి, నేను వెలమ అనే బలుపు. ఒకటి నా దగ్గర బాగా డబ్బుందనే బలుపు. నేను బాగా చదువుకున్నా అనే బలుపు" అంటూ అందరూ షాకయ్యేలా మాట్లాడారు శంకర్ నాయక్. అంతేకాదు ఎవర్ని కోసినా రక్తమే వస్తుందన్న ఆయన అందరం కలిసి మెలిసి ఉండటం ముఖ్యమన్నారు.

Full View 

Tags:    

Similar News