TRS Ministers vs MLA's: తెలంగాణలోని పలు జిల్లాల్లో మినిస్టర్స్ వర్సెస్ ఎమ్మెల్యేస్

TRS Ministers vs MLA's: ఒకరిద్దరు మినహా మిగతావారిది ఇదే పరిస్థితి..!

Update: 2022-03-13 05:45 GMT

TRS Ministers vs MLA's: తెలంగాణలోని పలు జిల్లాల్లో మినిస్టర్స్ వర్సెస్ ఎమ్మెల్యేస్

TRS Ministers vs MLA's: జిల్లాల్లో ఎమ్మెల్యేకే సూపర్ పవర్, వారికే ఇక ముందు అధిక ప్రాధాన్యత ఉంటుంది అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయా..? అసెంబ్లీ వేదికగా మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా మారిందా వ్యవహారం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత... ఇక ముందు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమకు తామే సూపర్ పవర్ అని భావించారు. జిల్లా స్థాయిలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు జరగాలన్న, ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను కోఆర్డినేట్ చేసే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేలకే అప్పగించారు సీఎం. అయితే సీఎం తీసుకున్న నిర్ణయంతో పార్టీ పరంగా జిల్లాలకు సుపీరియర్‌లు మాత్రం ఎమ్మెల్యేలే. అది అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరింత బయట పడింది.

సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తనకు సమయం ఇవ్వలేదని నేరుగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో వాగ్వాదానికి దిగారు. అటు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మంత్రి గంగుల కమలాకర్ తో ఆయనకు పొసకడం లేదట. పార్టీ పరమైన నిర్ణయాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసే అంశంపై మంత్రి అనుమతి లేనిదే నిధులు ఇవ్వలేమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడంతో వివాదం మరింత ముదురుతోంది.

ఇక రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఆ జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మొదటి నుండి పడటం లేదు. ఒక వైపు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో గొడవలు.. మరోవైపు మంత్రి తో విభేదాల కారణంగా పార్టీకి మరింత నష్టం కలుగుతోందని కిందిస్థాయి శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు. సీఎం నిర్ణయాన్ని పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి నిరంతరం ఘర్షణ పడటం వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇక ఖమ్మం జిల్లాలో మరో మంత్రి పువ్వాడ అజయ్‌తో ఎమ్మెల్యే రేగా కాంతారావుకు పొసకడం లేదట. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ నియోజకవర్గ పరిధిలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదని సభలోనే లేవనెత్తారు. దీంతో మంత్రికి ఎమ్మెల్యేలకు దూరం పెరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక టీఆర్ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేసిన వెంటనే కౌంటర్ అటాక్ చేసే ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ఆయన జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

మంత్రి ప్రశాంత్ రెడ్డి తో ఆయనకు గ్యాప్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు పార్టీకి సంబంధించిన నిర్ణయాల విషయాలతో పాటు ప్రభుత్వ పరమైన అంశాల్లో మంత్రి నిర్ణయం తప్పనిసరి కావడంతో మాటి మాటికి మంత్రి వద్దకు వెళ్ళలేక పోతున్నారట. ఇక మరో మంత్రి సత్యవతి రాథోడ్ తో ఆ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలకు పొసకడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా అధికార పార్టీకి సంబంధించిన దాదాపు అందరూ మంత్రులతో ఇదే పరిస్థితి నెలకొంది. ఒకరిద్దరు మంత్రులు తప్పితే మిగతా వారంతా ఎమ్మెల్యేలతో సరిగా ఉండటం లేదనే చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News