Chevella Road Accident: రోడ్డు ప్రమాదంలో గుండెను పిండేసే దృశ్యాలు

Chevella Road Accident: మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎందరికో కడుపు కోతను మిగిల్చింది. టిప్పర్-బస్సు ప్రమాదం పలు కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.

Update: 2025-11-03 10:22 GMT

Chevella Road Accident: రోడ్డు ప్రమాదంలో గుండెను పిండేసే దృశ్యాలు 

Chevella Road Accident: మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎందరికో కడుపు కోతను మిగిల్చింది. టిప్పర్-బస్సు ప్రమాదం పలు కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీ నగర్ ప్రాంతానికి చెందని ఎల్లయ్య‌గౌడ్ ముగ్గురు కుమార్తెలు తనూషా,సాయి ప్రియా, నందిని ప్రమాదంలో మృత్యుఒడికి చేరారు. నగరంలోని కింగ్ కోఠి మహిళా కళాశాలలో చదువుతున్న ఆ ముగ్గురు అక్కాచెళ్లెళ్లు గత నెల 16న జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపారు. ప్రమాద విషయం తెలిసిన తల్లిదండ్రులతో పాటు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఎల్లయ్యగౌడ్ పొట్ట కూటి కోసం డ్రైవర్ ‌గా పని చేస్తూ పిల్లల్ని చదివించారు. ఆయనకు నలుగురు కుమార్తెలు . ఒక కుమార్తెకు ఇప్పటికే వివాహం కాగా... మిగిలిన ముగ్గురు కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువుల శోక సంద్రంలో మునిగిపోయారు.

మీర్జాగూడ ప్రమాదంలో 3 నెలల చిన్నారితో సహా తల్లి కూడా మృతి చెందడం కలిచివేరిసంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పడుకున్న చిన్నారి ప్రమాదంలో తల్లి చేతిలోనే ప్రాణాలు వదిలింది. తలీ బిడ్డ రోడ్డుపై మృతి చెందిన దృశ్యాలు గుండెను పిండేస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. రోడ్డుపై విగత జీవులుగా పక్కపక్కనే పడి ఉన్న తల్లీ బిడ్డల ఫొటో ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది.

తాండూరు మండలం అచీపూర్‌కు చెందిన లక్ష్మీ, బందెప్ప దంపతులను బస్సు ప్రమాదం బలి తీసుకుంది. ఆసుపత్రికి అని వెళ్లిన అమ్మనాన్న ఇక రారని.. లేరని తెలిసిన ఇద్దరు కూతుర్లు కన్నీరు పెడుతుంటే చూసిన వారి గుండె చెరువైంది. అచీపూర్ గ్రామస్తులు ఆ చిన్నారులకు అండగా నిలిచారు. లక్ష‌్మీ , బందెప్ప మృతదేహాలను తీసుకెళ్లేందుకు చేవెళ‌్ల ఆస్పత్రికి వచ్చారు.

మరోవైపు యాలాల మండలం లక్ష‌్మీ నారాయణపూర్‌కు చెందిన అఖిల రెడ్డి అనే యువతి ప్రమాదంలో చనిపోయారు. ఎంబీఏ చదువుతున్న కుమార్తె మృతి చెందడంతో అఖిల తల్లి, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించారు. 

Tags:    

Similar News