Nizamabad: మైనార్టీ గురుకుల పాఠశాలలో.. ఉరి వేసుకుని 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
Nizamabad: నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది.
Nizamabad: నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి షేక్ ముసా..గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్ పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను తీసుకుంటున్నామని సి.ఐ. కృష్ణ తెలిపారు. ఘటనపై విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.