Hyderabad: ఓటు వేసి ఏపీ నుండి హైదరాబాద్‌‌కు బాట పట్టిన ప్రజలు

Hyderabad: విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ జామ్

Update: 2024-05-14 04:10 GMT

Hyderabad: ఓటు వేసి ఏపీ నుండి హైదరాబాద్‌‌కు బాట పట్టిన ప్రజలు

Hyderabad: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ ముగిసింది. ఓటర్లు సొంతూళ్లు వదిలి పట్నం బాట పట్టారు. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన ఓటర్లతో విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారి రద్దీగా మారింది. వందలాది వాహనాలు బారులు తీరి వెళుతున్నాయి. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. అర కిలోమీటర్ వరకు వాహనాలు స్తంభించిపోయాయి. వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. టోల్‌గేట్‌ దాటడానికి 15 నిమిషాలు పడుతోంది. 16 గేట్లకుగాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలను పంపిస్తున్నారు.

Tags:    

Similar News