Mahesh Kumar Goud: ఈడీ దాడులపై స్పందించిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud: 2014 నుంచి ఈడీ దాడుల్లో 96 శాతం ప్రతిపక్షాలపై జరిగినవే
Mahesh Kumar Goud: ఈడీ దాడులపై స్పందించిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌పై ఈడీ దాడులపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పందించారు. రాజకీయంగా ఎదుగుతున్నవారిపై ఈడీతో దాడులు చేయించడం బీజేపీకి ఆనవాయితీగా ఆయన మారిందని ఆరోపించారు. 2014 నుంచి ఈడీ జరిపిన దాడుల్లో 96 శాతానికి పైగా ప్రతిపక్షాలపై జరిగినవేనన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీ, సీబీఐని రాజకీయంగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రక్రియ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌తోనే ప్రారంభమైందని ఆరోపించారు. పొంగులేటిపై ఈడీ దాడులు కూడా బీజేపీపై బీఆర్ఎస్ ఒత్తిడి వల్లనే జరుగుతున్నట్లు ఆయన మాట్లాడారు.