Khammam: పండగ వేళ పిడుగుపాటు.. ముగ్గురు స్నేహితుల దుర్మరణం!

దసరా పండుగ మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. పండుగ వేళ సరదాగా వ్యవసాయ క్షేత్రం లో తిరిగి వద్దామని వెళ్ళిన నలుగురు స్నేహితులు పిడుగు దెబ్బకు చిక్కారు.

Update: 2019-10-09 06:08 GMT

దసరా పండుగ మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. పండుగ వేళ సరదాగా వ్యవసాయ క్షేత్రం లో తిరిగి వద్దామని వెళ్ళిన నలుగురు స్నేహితులు పిడుగు దెబ్బకు చిక్కారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్పీ కాలనీకి చెందిన ఇరుగు శ్రీను, బలంతు ప్రవీణ్‌, జి.నవీన్‌, ఉసికెల గోపిలు నలుగురూ స్నేహితులు. మంగళవారం సాయంత్రం సరదాగా తిరిగి రావడం కోసం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. వర్షం నుంచి తలదాల్చుకోవడానికి స్నేహితులంతా ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. దురదృష్టం వారిని వెంటాడింది. వారు కూచున్న చెట్టుమీద పిడుగు పడింది. దీంతో ఇరుగు శ్రీను, బలంతు ప్రవీణ్‌, జి.నవీన్ అక్కడికక్కడే చనిపోగా, గోపి తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. గోపిని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిసింది. పండగపూట చేతికి అందివచ్చిన బిడ్డలు దూరం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Tags:    

Similar News