Toy Gun: హైదరాబాద్ శివారులో బొమ్మ తుపాకీతో బెదిరింపు
Toy Gun: డబ్బులు డిమాండ్, ఇద్దరు అరెస్ట్
Toy Gun: హైదరాబాద్ శివారులో బొమ్మ తుపాకీతో బెదిరింపు
Toy Gun: హైదరాబాద్ పరిసరాల్లో బొమ్మ తుపాకీ తో బెదిరించి డబ్బులకు డిమాండ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ కి చెందిన బావోజు బ్రహ్మచారి, వనస్థలిపురంకి చెందిన వినయ్ మౌర్య, అనే ఇద్దరు సులభ సంపాదనకు అలవాటుపడి బొమ్మ తుపాకీతో కన్పించిన అమాయకులను బెదిరించి డబ్బులు వసూళ్లు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్ధరినీ అరెస్టుచేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.
తుర్కయాంజల్ కి చెందిన విర్జేసింగ్ అతని స్నేహితుడు వెంకట్ నాయక్ లు ఇద్దరూ దిల్ సుఖ్‌నగర్ లో షాపింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇన్నోవాలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఊహించని విధంగా తుపాకీతో గురిపెట్టి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుల్లో ఒకరైన వెంకట్ నిందితుల్లో ఒకరిని పట్టుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు నిందితుడిని నిర్భందించి పోలీసులకు అప్పగించారు. పట్టు బడిన నిందితుడి ఆధారంతో మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.