Vemulawada: వేములవాడలో దొంగల హల్చల్.. మహిళపై రాడ్‌తో దాడి

Vemulawada: మహిళ మెడలో బంగారు చైన్ లాక్కెళ్లిన దుండగుడు

Update: 2023-08-14 08:17 GMT

Vemulawada: వేములవాడలో దొంగల హల్చల్.. మహిళపై రాడ్‌తో దాడి

Vemulawada: వేములవాడ భగవంతరావు నగర్‌లో దొంగ హల్‌చల్ చేశాడు. ఉదయం ఓ ఇంట్లో దొంగతనానికి యత్నించాడు. అనుమానం రావడంతో ఇంట్లో నుంచి మహిళ బయటకు వచ్చింది. మహిళను చూడగానే దొంగ రెచ్చిపోయాడు. మహిళపై దాడికి యత్నించాడు. అయితే మహిళ ప్రతిఘటించడంతో మెడలోని చైన్‌తో దొంగ పారిపోయాడు. దొంగను పట్టుకునేందుకు మహిళ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News