Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కోసం కొనసాగుతున్న గాలింపు
Harsha Sai: హైదరాబాద్ నుండి విశాఖకు చేరుకున్న స్పెషల్ టీమ్
Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కోసం కొనసాగుతున్న గాలింపు
Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా.. పరారీలో ఉన్న హర్షసాయిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతని కోసం హైదరాబాద్ నుండి విశాఖకు స్పెషల్ టీమ్ చేరుకుంది.
పరారీలో ఉన్న హర్షసాయి, అతని తండ్రి రాధాకృష్ణ కోసం.. MVP పోలీస్ స్టేషన్ పరిధిలోని అతని ఇంటి సమీపంలో గాలిస్తున్నారు పోలీసులు. హర్షసాయి బంధువులు, స్నేహితులను అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హర్షసాయి ఈ కేసు విషయంలో విజయవాడకు చెందిన లాయర్‌ను నియమించుకోవడంతో.. విశాఖలో హర్షసాయి ఆచూకీ దొరకకపోతే విజయవాడలో గాలింపు చేపట్టనున్నారు.