ఐసీయూలో ఆర్థిక వ్యవస్థ: P Chidambaram

Update: 2020-02-08 10:47 GMT

ప్రధాని మోడీ నిర్ణయాలతో ఇండియా ఆర్దిక వ్యవస్థ ఐసీయూలో ఉందన్నారు మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం. కేంద్ర బడ్జెట్, దేశ ఆర్ధిక వ్యవస్థపై హైదరాబాద్‌లోని ముకురంజా కాలేజీలో ఏర్పాటు చేసిన సెమినార్ కు చిదంబరం ముఖ్యఅతిధిగా హజరై ప్రసంగించారు. కేంద్ర ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో చెప్పిన అంకెలన్నీ తప్పే అన్నారు.

వ్యవసాయం, గ్రామీణ భారతానికి బడ్జెట్ లో ప్రాధాన్యత దక్కలేదన్నారు. కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ర్టాలు నష్టపోతున్నాయని చిదంబరం చెప్పారు. తెలంగాణలో పన్నుల వాటాలో ఐదు వేల కోట్లు నష్టపోయిందన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని చిదంబరం అన్నారు.  

Tags:    

Similar News