నకిలీ విత్తన కంపెనీలకు చెక్‌.. వ్యవసాయశాఖ కీలక నిర్ణయం

ప్రతి ఎడాది ఎంతో మంది రైతులు నకిలీ విత్తనాలను కొని, అవి మొలకెత్తకపోవడంతో పంట నష్టపోయి చివరికి బలవంతంగా ప్రాణాలను కోల్పోతున్నారు.

Update: 2020-06-07 07:16 GMT

ప్రతి ఎడాది ఎంతో మంది రైతులు నకిలీ విత్తనాలను కొని, అవి మొలకెత్తకపోవడంతో పంట నష్టపోయి చివరికి బలవంతంగా ప్రాణాలను కోల్పోతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారు మాత్రం లాభాలను పొంది తమ కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. నకిలీ విత్తనాల నుంచి రైతులను కాపాడేందుకు వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.

మార్కెట్లో అమ్మే విత్తనాలు ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, అవి ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? అనే పూర్తి వివరాలు రైతులే తెలుసుకొనేలా చర్యలు చేపట్టింది. దీని కోసం క్యూఆర్‌ కోడ్‌ను, ట్రేసబిలిటీ కోడ్‌ను విత్తన సంచులపై ముద్రించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యవసాయశాఖ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విత్తన ధ్రువీకరణ అథారిటీ పాలకమండలి సమావేశంలో తీసుకున్నారు.

Tags:    

Similar News