Scheme: తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త..మరో కొత్త స్కీమ్ తెచ్చేందుకు సిద్ధమవుతోన్న సర్కార్..!!
Telangana cabinet expansion: నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నవారికి సీఎం రేవంత్ రెడ్డి విషేస్..!!
Scheme: తెలంగాణలో రైతులకు మరో అదిరిపోయే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పాటుపడుతోంది. వారికి రూ. 2లక్షల వరకు రుణమాఫీ కూడా చేసింది. రైతు భరోసాను ఇచ్చింది. సన్న బియ్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తోంది. రైతులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో రైతుల కుటుంబాలను ఆకర్షించేందుకు పాడి గేదెల పంపిణీ స్కీమును తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీని వల్ల లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా వారంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తారని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పాడి గేదెల పంపిణి స్కీమ్ ఇచ్చిది కాదు. ఈ రోజుల్లో ఒక్కో గేదె ధర రూ. 1లక్ష వరకు ఉంటోంది. అలాగే వాటికి వ్యాక్సిన్లను కూడా వేలకు వేలు ఖర్చు చేస్తుంది. మరి అలాంటి గేదెలను ఫ్రీగా ఇవ్వడం ప్రభుత్వానికి భారమే. అందులోనూ నిండా అప్పులు ఉన్న సమయంలో ఇలాంటి పథకాన్ని అమలు చేయడం కూడా సవాలు వంటిదే. అయినా సర్కార్ దశలవారీగాఅయినా ఈ పథకాన్ని అమలు చేసి రైతు కుటుంబాలకు దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఈ పాడి గేదెలను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లబ్దిదారుల జాబితాలను గ్రామాల్లో ప్రకటించి కుటుంబానికి 2 గేదెలను ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు చర్చలు జోరుగా సాగుతున్నాయి. కౌలు రైతులకు కూడా ఈ స్కీము వర్తింపచేయ్యాలా వద్దా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ స్కీము పేరు ఇందిరా చెంబరీ స్కీమ్. పేరు విచిత్రంగా అనిపించినా దీని ద్వారా ఫ్రీగా గేదెలు ఇవ్వడమే కాదు..ఈ ప్రక్రియలో ఎలాంటి ఖర్చులు అయినా అవన్నీ ప్రభుత్వమే భరించనున్నందని తెలిసింది. ప్రస్తుతం ఈ స్కీముకు సంబంధించిన గైడ్ లైన్స్ అధికారులు రూపొందిస్తున్నారని తెలిసింది. భూమి లేని రైతులకు కూడా ఫ్రీగా గేదెలు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇది నిజమైతే ఎక్కువ మంది రైతులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ స్కీమును స్థానిక ఎన్నికలకు ముందు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం పెద్ద ప్లానే చేస్తోంది. దీని ద్వారా రైతులు కాంగ్రెస్ కు ఓటు వేస్తే అప్పుడు ఫలితాలు కాంగ్రెస్ కే అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ చెప్పుకునే అవకాశం వస్తుంది. అది బీఆర్ఎస్ కు షాక్ లా అవుతుంది. అందుకే ఈ స్కీమును పక్కాగా అమలు చేసి బీఆర్ఎస్ జోరుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది