ఇవాళ, రేపు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు

Update: 2019-07-27 05:27 GMT

తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమబెంగాల్ కోస్తా తీర ప్రాంతాల్లోని వాయవ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ మీదుగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మరోవైపు పశ్చిమబెంగాల్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం తెలంగాణ ఉంది. అల్పపీడనం కారణంగా ఇవాళ, రేపు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్నిప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుసే అవకాశం ఉంది. 

Tags:    

Similar News