Telangana Weather Alert: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజుల పాటు వరుణుడి ఉగ్రరూపం!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విరామం తీసుకున్నా, మళ్లీ వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు మొదటి వారం నుంచి వరసగా కురిసిన వర్షాల వల్ల రహదారులు జలమయం కాగా, వాగులు వంకలు పొంగి పొర్లాయి.
Telangana Weather Alert: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజుల పాటు వరుణుడి ఉగ్రరూపం!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విరామం తీసుకున్నా, మళ్లీ వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు మొదటి వారం నుంచి వరసగా కురిసిన వర్షాల వల్ల రహదారులు జలమయం కాగా, వాగులు వంకలు పొంగి పొర్లాయి. ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపించగా, ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలు కూడా భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి.
గత కొన్ని రోజులు వర్షాలు తగ్గినా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో మళ్లీ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు నుంచి నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే మేఘాలు కమ్ముకుని వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి, గోల్కొండ, అత్తాపూర్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో బయటకు వెళ్లడంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.