Weather Update: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
Weather UPdate: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Weather Update: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
Weather UPdate: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాల అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.