ఇవాళ తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

Power Consumption: ఇవాళ తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది.

Update: 2023-03-30 10:51 GMT

ఇవాళ తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

Power Consumption: ఇవాళ తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15 వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇవాళ ఉదయం 11:01కు 15 వేల 497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగానికి 37శాతం వెళ్లింది. అత్యధిక విద్యుత్ వినియోగంలో దేశంలో తొలి రెండు స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. ఈ వేసవిలో 16వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంత డిమాండ్ వచ్చినా సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తామని.. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.

Tags:    

Similar News