Telangana Rising Global Summit: ఈనెల 8,9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
ఈనెల 8,9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాని మోడీ, రాహుల్‌ని ఆహ్వానించనున్న సీఎం రేవంత్ పలు రాష్ట్రాల సీఎంలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులను, ఆర్థికవేత్తలను పలువురిని ఆహ్వానించనున్న ప్రభుత్వం
Telangana Rising Global Summit: ఈనెల 8,9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఈనెల 8, 9వ తేదీన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్మానించాలని ప్రభుత్వం నిర్ణయించారు. అందులో భాగంగా ప్రధాని మోడీని, విపక్ష నేత రాహుల్ గాంధీని పలువురు నేతలను సీఎం రేవంత్‌రెడ్డిక స్వయంగా ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలను, పారిశ్రామికవేత్తలను, క్రీడాకారులను, ఆర్థికవేత్తలను పలువురుని ప్రభుత్వం ఆహ్వానించనుంది. ఆహ్వానించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి 4 వేల 500 మంది ప్రతినిధులకు ఆహ్మానం పంపించామని.. అందులో వేయ్యి మంది తమ రాకను నిర్థారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.