Ration Card: రేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్.. వారి కార్డులు రద్దు ?
Ration Card: తెలంగాణలో రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టింది. గత కొన్ని నెలలుగా రేషన్ తీసుకోని కార్డు హోల్డర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 80 శాతం కార్డుల తనిఖీ పూర్తవగా, వాటిలో సుమారు 30 శాతం మందికి రేషన్ కార్డు పొందేందుకు అర్హత లేదని అధికారులు గుర్తించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన నివేదిక ఆధారంగా, అనేక లోపాలను అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉండటం, కార్డు హోల్డర్లు మృతిచెందడం, డూప్లికేట్ ఆధార్‌తో కార్డులు తీసుకోవడం వంటి విషయాలు స్పష్టంగా వెల్లడయ్యాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రీ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించింది. జిల్లా, మండల స్థాయిలలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొందిన వివరాలను డిజిటల్‌గా నమోదు చేస్తున్నారు.
గత 6 నుంచి 12 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని కార్డుల్లో అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఈ కార్డులు రద్దయ్యే అవకాశముందని సమాచారం. కొందరు తాత్కాలికంగా రాష్ట్రంలో జీవనోపాధి కోసం రేషన్ కార్డులు తీసుకొని, తరువాత స్వస్థలాలకు వెళ్లిపోవడంతో రేషన్ తీసుకోవడం నిలిచిపోయింది.
ఈ పరిశీలన తుది దశలో ఉంది. అనంతరం కేంద్రం ఇచ్చిన లిస్టులోని అనర్హుల కార్డులు అధికారికంగా రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనవారికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది.