బ‌స్తీ ద‌వాఖాన‌ల‌పై కేటీఆర్ అద్భుతమైన ట్వీట్...

బస్తీల్లో ఉండే పేద ప్రజలకు వైద్య సదుపాయాలను అందించేందు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Update: 2020-06-14 11:29 GMT

బస్తీల్లో ఉండే పేద ప్రజలకు వైద్య సదుపాయాలను అందించేందు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బస్తీ దవాఖానలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. పేద ప్రజలు ఆ బస్తీదవఖానాల్లో మెరుగైన చికిత్స చేయించుకోవడం మాత్రమే కాదు, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోగలుగుతున్నారు.

నిరుపేదల్లో ప్రతి ఒక్కరికి చక్కటి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రుల్లో ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రతి ఒక్క పేదవారికి ఉచిత వైద్య సేవలు, మందులు, పలు రకాల రక్త, మూత్ర పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న ఈ బస్తీ దవాఖానలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆయన ట్విటర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు. నగర వ్యాప్తంగా 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ దవాఖానల్లో లక్షలాది మందికి ఉచిత కన్సల్టేషన్‌, మందులు, టీకాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో 168 బస్తీ దవాఖానలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.



Tags:    

Similar News