దేవుడిలా ఆదుకున్న కేటీఆర్ : ఆసుపత్రుల్లో 5రూపాయలకే భోజనం ఏర్పాట్లు

ప్రభుత్వం లాక్ డౌన్ నిర్వహించడంతో పట్టణంలోని పరిస్థితిని పరిశీలిస్తూ మంత్రి కేటీఆర్ నగరంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు.

Update: 2020-03-25 12:27 GMT
KTR Helping Poor Family

ప్రభుత్వం లాక్ డౌన్ నిర్వహించడంతో పట్టణంలోని పరిస్థితిని పరిశీలిస్తూ మంత్రి కేటీఆర్ నగరంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. ఈ నేపథ్యంలోనే ఎర్రగడ్డ లో వ్యాధినిరోధక మందు స్ప్రే చేస్తున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆ పక్కనే ఉన్న మెడికల్ షాపులోకి వెల్లి కరోనా వ్యాధి గురించి వివరించి, ఆ తరువాత అక్కడున్నవారికి వ్యాధి నిరోధంపై అవగాహన కల్పించారు. మనిషికి, మనిషికి మధ్య దూరం పాటించాలని ఆయన తెలిపారు. ఎప్పటి కప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, శానిటైజర్లు, మాస్కులు వాడాలని తెలిపారు.

కరోనా వ్యాధి నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు, ఆ కారణంతోనే స్ప్రే కూడా చేస్తున్నామని, ప్రజలు బయపడనవసరం లేదని ధైర్యం చెప్పారు. అనంతరం రోడ్డుపై వెలుతున్న వాహనదారులను ఆపి బయటికి ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. దాంతో ప్రయాణికుల తాము ఉంటున్న ఆస్పత్రిలో ఆహారం అందటం లేదని మంత్రి కేటీఆర్ కి విన్నవించాడు. దీంతో స్పందించిన కేటీఆర్ రేపటి నుండి ఆస్పత్రిలో 5 రూపాయల భోజనం ప్రతి ఒక్కరికి అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని హామీ ఇచ్చారు.

అనంతరం పట్టణంలోని ట్యాంక్ బండ్ వైపు వెలుతున్న కేటీఆర్ ట్యాంక్ బండ్ వద్ద నున్న బుద్ధ భవన్‌ వద్ద భార్య, పిల్లలు, భుజాన సంచులతో ఎండనపడి నడుస్తున్న వారిని చూసారు. వారి దగ్గరికి వెల్లిన ఆయన తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిసి కూడా గుంపులు గుంపులుగా ఎక్కడికి వెలుతున్నారని ప్రశ్నించారు. దీంతో వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వారు ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చమని, ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో బతకలేమని తెలిపారు. అందుకే సొంతూళ్లకు వెళదామని పయనం అయ్యామని కానీ ఒక్క బస్సుకూడా నడవడం లేదని వాయపోయారు. వారి బాధలు తెలుసుకున్న కేటీఆర్ వెంటనే తనకు తెలిసిన వారి ద్వారా ఓ గూడ్స్ ఆటో ట్రాలీని పిలిపించారు. అందులో వారిని ఎక్కించి వారి స్వగ్రామాలకు పంపించారు.


Tags:    

Similar News