మోదీ వ్యాఖ్యలపై పండిపడ్డ మంత్రి జగదీష్‌రెడ్డి

పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు.

Update: 2020-02-08 12:03 GMT

పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల సూర్యాపేటలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన సంఘం చైర్మన్‌ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీపార్క్‌లో జరిగిన చైర్మన్‌ పౌర సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్యానించి మోదీ, సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు భయపెడుతున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడకపోతే కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకపోయే వాడని తనకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని ప్రధాని మోదీ భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారని, కేంద్రంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరేండ్లు ప్రధానిగా 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గుజరాత్‌ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ది చేయలేదని ఎద్దేవా చేశారు.

ఏ సందర్భం లేకున్నా పార్లమెంట్‌ ఉభయసభల్లో తెలంగాణ ఇవ్వడమే అన్యాయం అన్న పద్దతిలో మోదీ వ్యాఖ్యలు చేసారని, కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలు గుజరాత్‌తో పాటు రాష్ట్రలన్నింటికీ ఆదర్శంగా నిలిచాయని, అదే చర్చకు దారితీస్తుందని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో పేద ప్రజలు ఎంతగానో లబ్ది పొందుతున్నారని అన్నారు.


Tags:    

Similar News