Kalvakuntla Kavitha: రాత్రికి రాత్రే కవిత ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగింపు.. జాగృతి నాయకుల ఆగ్రహం
Kalvakuntla Kavitha: నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 'జనంబాట' కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల తొలగింపు స్థానికంగా కలకలం రేపింది.

కవితకు స్వాగతం పలుకుతూ నల్లగొండ పట్టణంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే ఆ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తొలగించారు.
మున్సిపల్ అధికారుల ఈ చర్యపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణం లేకుండానే స్వాగత ఏర్పాట్లను అడ్డుకోవడాన్ని వారు ఖండించారు. ఈ తొలగింపు రాజకీయ ప్రేరేపితమేనని జాగృతి కార్యకర్తలు మండిపడుతున్నారు.