Heavy Rains: తెలంగాణలో నేడు భారీ.. రేపు అతి భారీ వర్షాలు

Heavy Rains: తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు ఉధృతం కానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Update: 2025-07-07 05:54 GMT

Heavy Rains: తెలంగాణలో నేడు భారీ.. రేపు అతి భారీ వర్షాలు

Heavy Rains: తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు ఉధృతం కానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రత్యేకంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు పేర్కొంది.

అంతేకాదు, మంగళవారం రోజు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News