Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టు నుండి కీలక ఊరట లభించింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు గతంలో నమోదైన పరువు నష్టం కేసును హైకోర్టు కొట్టివేసింది.

Update: 2025-08-01 05:59 GMT

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టు నుండి కీలక ఊరట లభించింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు గతంలో నమోదైన పరువు నష్టం కేసును హైకోర్టు కొట్టివేసింది.

ఈ కేసు నేపథ్యం ప్రకారం, 2023 మే 4న కొత్తగూడెంలో జరిగిన ఓ సభలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆరోపిస్తూ కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని సభలో వ్యాఖ్యానించారని, ఆ మాటలే తమ పార్టీకి హానికరమని ఆయన పేర్కొన్నారు.

ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉండగా, దానిని కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించగా, కేసును కొట్టివేస్తూ సీఎం రేవంత్‌కు ఊరట కలిగేలా నిర్ణయం ఇచ్చింది.

Tags:    

Similar News