Omicron Live Updates: ఒమిక్రాన్ తో అప్రమత్తమైన తెలంగాణ.. వ్యాక్సినేషన్‌ వేగవంతం...

Omicron Live Updates: నెలాఖరులోగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ప్రణాళిక..

Update: 2021-12-08 02:45 GMT

Omicron Live Updates: ఒమిక్రాన్ తో అప్రమత్తమైన తెలంగాణ.. వ్యాక్సినేషన్‌ వేగవంతం...

Omicron Live Updates: ఒమిక్రాన్ వేరియంత్ ప్రపంచదేశాల్ని కలవరపెడుతోంది. కరోనా తగ్గుతున్న సమయంలో ఒమిక్రాన్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సిన్‌ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మొదటి డోస్ తీసుకున్నవారే అధికంగా ఉన్నారు. రెండో డోస్ తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 66వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 26వేల బెడ్స్‌కి ఆక్సిజన్ సదుపాయం ఉందన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇంకా మన రాష్ట్రంలో నమోదు కాలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారు సురక్షితంగా ఉన్నారని తీసుకొని వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. బూస్టర్ డోస్ కోసం ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని మంత్రి హరీశ్ తెలిపారు.

Tags:    

Similar News