DWCRA News: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ రోజే మీ డబ్బులను తీసుకోవచ్చు

DWCRA News: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు శుభవార్తను తీసుకొచ్చింది. ఇవాల్టి నుంచే మీకు వచ్చిన డ్వాక్రా డబ్బులను తీసుకోవచ్చని ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2025-07-12 06:23 GMT

DWCRA News: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ రోజే మీ డబ్బులను తీసుకోవచ్చు

DWCRA News: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు శుభవార్తను తీసుకొచ్చింది. ఇవాల్టి నుంచే మీకు వచ్చిన డ్వాక్రా డబ్బులను తీసుకోవచ్చని ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుని నమ్మ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్తను తీసుకొచ్చింది. ఈ రోజు నుంచే డబ్బులు తీసుకోవచ్చిని వెల్లడించింది. దీనికోసం రూ.344కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేసింది.

మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలి. అలా మహిళలు నిలబడినప్పుడే కుటుంబం కూడా నిలబడుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర మహిళలకోసం స్వయం సహాయక సంఘాలు(డ్వాక్రా)కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 344 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేసింది. ఈ డబ్బును ఇవాల్టి నుంచే తీసుకోవచ్చు. ఈ నిధుల్లో గ్రామాల్లో మహిళా సంఘాలకు రూ. 300 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పట్టణాల్లోని మహిళా సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించారు. వెంటనే ఇవి పొదుపు సంఘంలో జమ అవుతాయి కాబట్టి డ్వాక్రా మహిళలు సంబంధించిన బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు.

సోసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) సంస్థ ఈ డబ్బును మహిళలకు ఇస్తుంది. జులై 12 నుంచి 18 వరకు మహిళల అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చెక్కులను అందజేయనున్నారు. ఇంతకు ముందు రాష్ట్రంలో వడ్డీ లేఇన రుణాల పంపిణీలో చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. అందువల్ల దాదాపు రూ. 3వేల కోట్ల బకాయిలు ఉండిపోయాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలను ఇచ్చింది.

మహిళలను పైకి తీసుకొస్తే , కుటుంబం కూడా పైకి వస్తుంది అందుకే ముందు మహిళలను తమ కాళ్లపై నిలబడనివ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. అందుకే మహిళా సంఘాల విషయంతో తాము శ్రద్ద చూపిస్తున్నట్లు చెప్పారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ఈ డబ్బులు ఉపయోగపడాలని చెప్పారు.

పొదుపు సంఘాల నుండి రుణాలను తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న వ్యాపారాలకు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్‌లు కుట్టడానికి, మహిళా శక్తి, క్యాంటీల నిర్వహణ, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, విస్తరాకులు తయారీ, పేపర్ ప్లేట్లు, గ్లాసుల తయారీ వంటి 17 రకాల వ్యాపారాలను అధికారులు గుర్తించారు. ఈ వ్యాపారాల ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందొచ్చు. అదేవిధంగా ఇతరులకు ఉపాధిని కూడా కల్పించవచ్చు. ఇప్పుడు విడుదల చేసిన డబ్బుల ద్వారా ఏకంగా రాష్ట్రంలో 65లక్షల మంది మహిళలు లబ్ధిపొందుతారు.

Tags:    

Similar News