Telangana: మ‌హిళ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. మ‌రో కీల‌క నిర్ణ‌యం

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి ప్రయోజనాలను అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్త అవకాశాన్ని తెచ్చింది.

Update: 2025-06-04 07:30 GMT

Telangana: మ‌హిళ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. మ‌రో కీల‌క నిర్ణ‌యం

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి ప్రయోజనాలను అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్త అవకాశాన్ని తెచ్చింది. దీని ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబిగా మారే అవకాశాలు పెరుగనున్నాయి.

ఇప్పటి వరకు మహిళలు ఆర్‌టీసీకి బస్సులు అద్దెకు ఇవ్వడం, ఇసుక రవాణా, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ వంటి సేవల్లో భాగంగా ఉన్నారు. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లుగా కూడా మహిళలకు అవకాశం కల్పించనుంది. రాష్ట్రం వ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన టీ-ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా ఈ అవకాశం కల్పించనుంది.

ప్రతి జిల్లాలో సుమారు 90 యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఒక్కో యూనిట్‌కి ఒక గ్రామం అనుకోవచ్చు. రాష్ట్రం మొత్తం మీద 3,000 కేబుల్ యూనిట్లను మహిళా సంఘాలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ అవకాశాన్ని పొందిన మహిళలకు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణను అందిస్తారు. అలాగే కార్యాలయం నెలకొల్పేందుకు, అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు స్త్రీ నిధి సమాఖ్య ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.4 లక్షల వరకూ రుణం ఇవ్వనున్నారు.

మాహబూబ్‌నగర్ జిల్లాలో 11,300కు పైగా, నారాయణపేటలో 8,200కు పైగా, నాగర్ కర్నూల్ జిల్లాలో 13,000కు పైగా, వనపర్తిలో 7,500కు పైగా, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 6,900కు పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయనున్నారు.

Tags:    

Similar News