Jishnu Dev Varma: జోగులాంబ గద్వాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Jishnu Dev Varma: ఇవాళ గద్వాల జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు.

Update: 2025-12-23 05:58 GMT

Jishnu Dev Varma: జోగులాంబ గద్వాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Jishnu Dev Varma: ఇవాళ గద్వాల జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని గవర్నర్ దర్శించుకోనున్నారు. అనంతరం గద్వాల, వనపర్తి జిల్లాల్లోని కలెక్టరేట్‌లో జరిగే అధికారులతో సమావేశానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా జిల్లాలో పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

జెడ్ ప్లస్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ముందస్తు తనిఖీలు చేపట్టామని, అలంపూర్ హరిత హోటల్, గద్వాల ఐడీఓసీ వద్ద గవర్నర్‌కు గౌరవ సూచకంగా ‘గార్డ్ ఆఫ్ హానర్’ కార్యక్రమం ఉంటుందని ఆయన వివరించారు. భద్రతా కారణాల దృష్ట్యా మీడియా ప్రవేశాన్ని కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

 

Tags:    

Similar News