Karimnagar: కరీంనగర్‌కు నిధుల వరద...

Karimnagar: హుజూరాబాద్ ఉపఎన్నికల అనివార్యం కావడంతో పెండింగ్ పనుల కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారు

Update: 2021-06-12 06:35 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Karimnagar: సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా పై ఫోకస్ పెట్టారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలోనే ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ పెద్ద ఎత్తున పెండింగ్ పనుల కోసం నిధులను విడుదల చేస్తోంది. కాని హుజురాబాద్ ఎన్నికలతో అధికార టీఆర్ఎస్ మొత్తం కరీంనగర్ జిల్లాపై ఫోకస్ పెట్టింది.

ముఖ్యంగా ఈటల రాజేందర్ ప్రత్యర్థి పార్టీ బిజెపి తీర్థం పుచ్చుకోనుండడంతో టీఆర్ఎస్ వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి..ఎన్నికల కోసం సీఎం కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.. భవిష్యత్ పరిణామాణాలను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ అభివృద్దికి శ్రీకారం చుట్టారు. లోయర్ మానేరు నదిని సుందరీకరణ, పటిష్టపరచడం కోసం ప్రభుత్వం చేపట్టిన, మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా ... నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం, పర్యాటకంగా అభివృద్ది కోసం రూ 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో కాపీని సిఎం కెసిఆర్ స్వయంగా తన చేతుల మీదుగా మంత్రి గంగుల కమలాకర్ కు, శుక్రవారం ప్రగతి భవన్ లో అందచేశారు.

ఈ ప్రాజెక్టు ద్వార డ్యాం కింది నుండి చేగుర్తి వరకు సుమారు పది కిలోమీటర్ల మేర డ్యాం కు ఇరువైపులు కరకట్టల నిర్మించడం ద్వార పర్యాటకంగా కొత్త కళ తీసుకురానున్నారు.ఈ నేపథ్యంలోనే మానేరు రివర్ ఫ్రంటు నిర్మాణ పనుల డీపీఆర్ తయారీకి టెండర్ ఖరారు కోసం విధి విధానాలను రూపొందించడానికి గాను మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అధ్యక్షతన మంత్రి గంగుల కమలాకర్ , పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లతో ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో జూన్ 12న సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట,హుజురాబాద్ మున్సిపాలిటిల అభివృద్దిపై సుదీర్ఘ చర్చ జరగనుందని సమాచారం.

Tags:    

Similar News