లక్ష దాటిన వలస ప్రయాణం

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్రలు లాక్ డౌన్ ని సరైనా మార్గంగా ఎంచుకోవడంతో వలసకూలీల పరిస్థితి దారుణంగా తయారైంది.

Update: 2020-05-21 03:24 GMT

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్రలు లాక్ డౌన్ ని సరైనా మార్గంగా ఎంచుకోవడంతో వలసకూలీల పరిస్థితి దారుణంగా తయారైంది.ప్రజారవాణా లేకపోవడంతో కొందరు కాలినడకన వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా, మరికొందరు మాత్రం ఎక్కడివాళ్ళు అక్కడే చిక్కుకోని ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అయితే వీరిని తమ సొంత రాష్ట్రలకి తరలించేందుకు ఈనెల ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగా దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక శ్రామిక్‌ రైళ్ల ద్వారా బుధవారం సాయంత్రానికి తెలంగాణ నుంచి 74 రైళ్ల ద్వారా 1,00,324 మంది స్వస్థలాలకు చేర్చింది. ఇందులో ఎక్కువ మంది ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వారున్నారు. ఈ విషయాన్నీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ మేరకు అధికారులను అభినందించారు. ఇతర రాష్ట్రాలకు పంపిన వలస కార్మికులందరికీ ఛార్జీల చెల్లింపుగా రాష్ట్ర ప్రభుత్వం రైల్వేలకు రూ .8.5 కోట్లు చెల్లించిందని ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎస్సీశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఆర్థికశాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌, పోలీస్‌శాఖ అదనపు డీజీ జితేందర్‌, పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, మహేశ్‌భగవత్‌, సజ్జనార్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు, అమయ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Tags:    

Similar News