కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం...

Corona Third Wave: 545 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నిల్వకు ఆరోగ్యశాఖ కసరత్తు...

Update: 2021-12-15 03:06 GMT

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం...

Corona Third Wave: కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్తగా 21లక్షల హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేస్తోంది. అదేవిధంగా 545 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సౌకర్యం సిద్ధం చేయాలనుకుంది. కోవిడ్‌ పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తోంది. ఇక విదేశాల్లో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు పలు సూచనలు చేసింది వైద్యారోగ్యశాఖ.

దేశంలో ఎక్కువగా కేరళ, మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి హారీష్‌ రావు సూచనలు చేశారు. మూడోవేవ్‌ సన్నద్ధత ప్రణాళిక గురించి వివరించారు. 27 వేల 996 పడకలకు గాను 25 వేల 826 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించడం పూర్తయిందని మంత్రికి అధికారులు తెలియజేశారు.

ఇక ప్రభుత్వాలకు తోడుగా, ప్రజలు వారి బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుందన్నారు మంత్రి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ వేగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు మంత్రి హరీష్‌ రావు. రెండో డోసుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం లాంటివి తప్పక పాటించాలన్నారు.

Tags:    

Similar News