Telangana: రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
Telangana: జీవోను జేఏసీ ప్రతినిధులకు అందజేసిన మంత్రి గంగుల కమలాకర్
Telangana: రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
Telangana: రేషన్ డీలర్లకు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. డీలర్ల కమిషన్‌ను రెండింతలు పెంచింది. ఈ మేరకు విడుదల చేసిన జీవోను జేఏసీ ప్రతినిధులకు అందజేశారు మంత్రి గంగుల కమలాకర్. ప్రస్తుతం టన్నుకు 700 రూపాయల కమిషన్ ఉండగా.. 14 వందల రూపాయలకు పెంచింది ప్రభుత్వం. పెంపుతో ఏటా 303 కోట్ల రూపాయల భారంలో 245 కోట్లు రాష్ట్రం భరిస్తుందని తెలిపారు మంత్రి గంగుల. ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు రేషన్ డీలర్లు.