Telangana New Ration Cards: కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం.. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తకార్డులు
Telangana New Ration cards: రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
New Ration Cards in Telangana: తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త..కొత్త రేషన్ కార్డు దరఖాస్తు తేదీలను ప్రకటించిన సీఎం రేవంత్
Telangana New Ration cards: రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి అయితే 3.50 ఎకరాలు, చెలక అయితే 7.5 ఎకరాలుగా ప్రతిపాదించారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు లోపు ఉంటే రేషన్ కార్డు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ పై చర్చించారు. అయితే రేషన్ కార్డుల విధివిధానాల రూపకల్పనలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అందరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత.. వచ్చే సమావేశంలో రేషన్ కార్డుల జారీపై విధివిధానాలు ఖరారు చేయనున్నారు.