Cabinet Expansion: ఉగాదికి కేబినెట్ విస్తరణ..రేసులో ఉన్న కీలక నేతలు వీళ్లే?

Update: 2025-03-25 01:15 GMT

Telangana Cabinet Expansion: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడు అంతా కేబినెట్ విస్తరణ గురించే చర్చ జరుగుతోంది. దీంతో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్రంలో డెవలప్ మెంట్, సంక్షేమం గురించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆసక్తి చూపించారని ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ఇందిరా భవన్ లో సమావేశం అయ్యారు. ఈ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. రాష్ట్రంలో ఆరోగ్య, విద్య, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డెవలప్ మెంట్ గురించి నాయకులు అధిష్టానంకు వివరించారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అలాగే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ ఏర్పాటు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చలు జరిగినట్లు తెలిపారు అన్ని విభాగాల విషయాలను పార్టీ అధిష్టానం సమీక్షించిందని త్వరలోనే నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ఇదెలా ఉండగా ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ మంత్రి వర్గ విస్తరణ కోసం కాదని అధికారికంగా ప్రకటించినా ఇది హైకమాండ్ తో చర్చించాల్సిన కీలక అంశాల్లో ఒకటిగా ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం అంశంపై పలు దఫాలుగా చర్చలు జరిపింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ కూడా రాష్ట్రంలో కీలక నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతా వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. దీంతో కెబినేట్ విస్తరణపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఇక మంత్రివర్గంలో చోటు కోసం పలు సామాజికి వర్గాలకు చెందిన నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో కలిసి సంప్రదింపులు చేస్తున్నారు. బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ.. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి పేరుతో పాటు మరికొందరి పేర్లు చర్చలో ఉన్నాయి. రెడ్డి కోటాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ మీర్ అమీర్ అలీఖాన్‌కు అవకాశం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News