Harish Rao: 111 జీవో ప్రాంతంలో రహదారులు విస్తరిస్తాం

Harish Rao: 84 గ్రామాలకు మేలు చేసేందుకే జీవో ఎత్తివేశాం

Update: 2023-05-19 04:01 GMT

Harish Rao: 111 జీవో ప్రాంతంలో రహదారులు విస్తరిస్తాం

Harish Rao: కేబినెట్ భేటీలోని నిర్ణయాలను మంత్రి హరీశ్ రావు వివరించారు. 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు మేలు చేసేందుకే ఆ జీవోను ఎత్తివేశామని, 111 జీవో ప్రాంతంలోని రహదారులను విస్తరిస్తామని వెల్లడించారు. 2018 ఎన్నికల్లో 111 జీవోను ఎత్తివేస్తామని సీఎం హామీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ఇక నుంచి ఆంక్షలు ఉండవని, ఈ గ్రామాల చుట్టూ రింగ్ మైన్ను నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, కాళేశ్వరం జలాలను మూసి, గండిపేటకు లింక్ చేయాలని నిర్ణయించామన్నారు. హుస్సేన్సాగర్ను రానున్న రోజుల్లో అనుసంధానించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.

Tags:    

Similar News