BJP: GHMC విస్తరణపై ఇవాళ తెలంగాణ బీజేపీ కీలక సమావేశం

GHMC విస్తరణపై ఇవాళ తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది.

Update: 2025-12-10 05:45 GMT

BJP: GHMC విస్తరణపై ఇవాళ తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. కాసేపట్లో రాష్ట్ర కార్యాలయం టీబీజేపీ చీఫ్‌ రామచందర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జ్‌లు, ఎంపీ, ఎమ్మెల్సీ, Ghmc ప్లోర్ లీడర్, డిప్యూటీ ప్లోర్ లీడర్, కార్పొరేటర్లు హాజరవనున్నారు.

ఇటీవల ప్రభుత్వం GHMCలో 27 మున్సిపాలిటీలు విలీనం చేసింది. GHMCలోని డివిజన్లను 3 వందలకు పెంచుతూ జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ స్టాండ్‌పై సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు టీబీజేపీ చీఫ్‌. డివిజన్ల పెంపుపై పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణపైనా దిశానిర్దేశం చేస్తారు. 

Tags:    

Similar News