Telangana Assembly Sessions: ఈనెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది.
Telangana Assembly Sessions: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు, కీలకమైన ప్రాజెక్టుల అంశాలే ప్రధాన అజెండాగా ఈ దఫా సమావేశాలు సాగనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఈ సమావేశాల్లో ప్రధానంగా గోదావరి, కృష్ణా నదీ జలాల పంపిణీ మరియు ప్రాజెక్టుల నిర్వహణపై విస్తృత చర్చ జరగనుంది. అంతర్రాష్ట్ర జల వివాదాలు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిలోని అంశాలు మరియు ప్రాజెక్టుల భవిష్యత్తుపై ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించనుంది.
కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న వివిధ రాష్ట్ర ప్రాజెక్టులు, నిధుల విడుదల మరియు విభజన హామీల అమలుపై ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయంపై ఒక తీర్మానం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.