Tamilisai Soundararajan: నాకెలాంటి కన్నింగ్ మనస్తత్వం లేదు
Tamilisai Soundararajan: తెలంగాణలో నాలుగేళ్లు పూర్తిచేసుకున్నా
Tamilisai Soundararajan: నాకెలాంటి కన్నింగ్ మనస్తత్వం లేదు
Tamilisai Soundararajan: ప్రోటోకాల్ నిబంధనలతో తనను కట్టడి చేయలేరని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. గవర్నర్‌గా తమిళిసై నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా గవర్నర్ కాఫీ టేబుల్ బుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని అన్నారు. 15 శాతమే సేవ చేశానని, ఇంకా ఎంతో చేయాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కోర్టు కేసులు, విమర్శలకు భయపడేది లేదని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకెలాంటి కన్నింగ్ మైండ్‌సెట్ లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల విజయమే తన విజయమని మాట్లాడారు గవర్నర్.