Hyderabad: పెరుగుతున్న స్వైన్‌ ఫ్లూ కేసులు

ఈ మధ్యకాలంలో చైనాలో పుట్టిన కరోనావైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అని నగర ప్రజలు ఎంతో భయపడుతున్నారు.

Update: 2020-02-22 11:02 GMT

ఈ మధ్యకాలంలో చైనాలో పుట్టిన కరోనావైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అని నగర ప్రజలు ఎంతో భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస కోశ సమస్యల బాధపడుతున్నవారు ఎక్కడ తమకు కరోనా వ్యాపించిందో అన్న భయంతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పరీక్షల్లో కొంత మందికి కరోనా అని తేలక పోవడంతో సంతోషించినప్పటికీ కొంత మంది మాత్రం బాధపడుతున్నారు. వారికి స్వైన్ ఫ్లూ వచ్చిందని బాధపడుతున్నారు.

మారుతున్న వాతావరణం కారనంగా ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకూ 15 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవ్వగా, చాపకింద నీరులా స్వైన్‌ ఫ్లూ విస్తరించి ఒక్క ఫిబ్రవరి నెలలోనే 8 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వాతావరణం పగలు ఉష్ణోగ్రతలు వేడిగా, రాత్రి ఉష్ణోగ్రతలు చల్లగా ఉండడంతో ఈ ఫ్లూ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక పోతే గతేడాది స్వైన్‌ ఫ్లూతో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక అధిక శాతంలో స్వైన్‌ప్లూ కేసులు పెరిగిపోవడంతో వైద్యులు రోగులకు జాగ్రత్తలు చెపుతున్నారు. ఫ్లూ బారి నుంచి తప్పించుకోవడానికి జాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News