రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలకు శనివారం నుంచి వేసవి సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపింది. 2017 విద్యాసంవత్సరం వరకు పాఠశాలలు ఏప్రిల్ 24వ తేదీ వరకు జరిగేవి. ఏటా ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులుండేవి. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభమయ్యేవి.
విద్యాసంవత్సరం కూడా జూన్ 12న ప్రారంభమయేది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానానికి రెండేళ్లుగా స్వస్తి పలికింది. దీంతో వచ్చే విద్యాసంవత్సరం ముందస్తుగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రెండోసారి జూన్ 1న విద్యాసంవత్సరం కావడం విశేషం. ఇంకోవైపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లోకి తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భౌగోళిక అంశాలను విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.