Local Bodies: ముగిసిన పదవీకాలం.. మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన..!
Local Bodies: తెలంగాణలోని మున్సిపాలటీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది.
Local Bodies: ముగిసిన పదవీకాలం.. మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన..!
Local Bodies: తెలంగాణలోని మున్సిపాలటీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. నేటితో మున్సిపాలిటీల్లో పాలకవర్గం గడువు ముగిసింది. 130 మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారులే ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం వరకూ రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు ఉండగా.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇటీవల 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 154 మున్సిపాలిటీలు ఉన్నాయి.
అయితే 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు మాత్రం 2021లో ఎన్నికలు జరిగాయి. మరో 4 మున్సిపాలిటీలు ఏజెన్సీ పరిధిలో ఉండటంతో పాల్వంచ, మణుగూరు, మందమర్రి, జహీరాబాద్ లాంటి మున్సిపాలిటీలకు అసలు ఎన్నికలే నిర్వహించలేదు. వీటి బాధ్యతను స్పెషల్ ఆఫీసర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.